Beast Movie Review
#beast
#thalapathyvijay
#poojahegde
#tollywood
#kollywood
#beastmovie
విభిన్నమైన కథ, వినోదం నేపథ్యంగా రూపొందిన డాక్టర్ చిత్రంతో నెల్సన్ దిలీప్ కుమార్ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. ఆ చిత్రం తర్వాత దళపతి విజయ్‌తో బీస్ట్ అని ప్రకటన రాగానే.. తెలుగు, తమిళ రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే బీస్ట్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల్లో ఒక శాతం కూడా అందుకోలేకపోయాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. కథే లేకుండా తెర మీద చేసిన విన్యాసాలు దారుణంగా ఉన్నాయి. ఆద్యంతం విసుగు పుట్టించే సన్నివేశాలు, ఊహకు అందని, సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేనంతగా కథనం, యాక్షన్ సీన్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేంతగా ఉన్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా డైరెక్టర్‌గా విలక్షణతను చూపించుకోవడంలోను, అన్ని విభాగాలను సరైన దిశగా నడిపించడంలో దారుణంగా విఫలమయ్యాడని చెప్పవచ్చు.